రేవ్ పార్టీ కేసు: నటి హేమకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు

  • ఇటీవల బెంగళూరులోని ఓ ఫాం హౌస్ లో రేవ్ పార్టీ
  • నటి హేమను అరెస్ట్ చేసిన పోలీసులు
  • జ్యుడిషియల్ కస్టడీలో భాగంగా పరప్పన అగ్రహార జైల్లో ఉన్న హేమ
బెంగళూరులోని ఓ ఫాం హౌస్ లో రేవ్ పార్టీని పోలీసులు భగ్నం చేయగా, టాలీవుడ్ నటి హేమ కూడా పట్టుబడడం తెలిసిందే. హేమను పోలీసులు అరెస్ట్ చేశారు. తాజాగా, ఈ కేసులో నటి హేమకు ఊరట లభించింది. ఆమెకు బెంగళూరు స్పెషల్ కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. 

ప్రస్తుతం జ్యుడిషియల్ కస్టడీలో భాగంగా హేమ పరప్పన అగ్రహార జైల్లో ఉన్నారు. బెయిల్ లభించిన నేపథ్యంలో, ఆమె జైలు నుంచి బయటికి రానున్నారు. ఇవాళ బెయిల్ పిటిషన్ విచారణ సందర్భంగా హేమ తరఫున అడ్వొకేట్ మహేశ్ కిరణ్ శెట్టి వాదనలు వినిపించారు. తన క్లయింటు వద్ద ఎలాంటి డ్రగ్స్ లభించలేదని కోర్టుకు తెలియజేశారు.

Hema
Bail
Rave Party
Bengaluru
Tollywood

More Telugu News